Rakul Preet Singh: కిచెన్ లో కలసి వంట చేస్తున్న సిద్ధార్థ మల్ హోత్రా , రకుల్!

  • జైసల్మేర్ లో జవాన్ల కుటుంబాలను కలిసిన జంట
  • 'అయ్యారీ' ప్రమోషన్ లో బిజీగా సిద్ధార్థ మల్ హోత్రా, రకుల్
  • జవాన్లతో సరదాగా గడిపిన నటీ నటులు
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్ హోత్రా వంటగదిలో గరిటె తిప్పుతుంటే ఆయనకు రకుల్ ప్రీత్ సింగ్ సాయం చేయడం ఏంటని అనుకుంటున్నారా? నిజమే. ఈ జంట నటించిన హిందీ చిత్రం 'అయ్యారీ' త్వరలో విడుదల కానుండగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరూ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల కుటుంబాలను కలుసుకున్నారు. వీరితో పాటు పూజా చోప్రా తదితరులు జైసల్మేర్ ప్రాంతానికి వచ్చి బీఎస్ఎఫ్ జవాన్ల కుటుంబాలతో కలసి మాట్లాడారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ గరిటె చేతబట్టి, వంటగదిలోకి దూరగా, ఆయనకు రకుల్ సాయం చేసింది. వండిన వంటకాలను జవాన్లకు తినిపించిన ఈ జంట, వారితో సరదాగా ఆటలాడి ఉత్సాహ పరిచారు. కాగా, సైనిక అధికారి అభియాన్ సింగ్ం మేజర్ జయ్ బక్సీల బయోగ్రఫీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Rakul Preet Singh
Sidhartha malhotra
Ayyaree

More Telugu News