ongc: ఓఎన్జీసీ హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో ఒకరి మృతదేహం లభ్యం

  • సముద్రంలో కూలిన ఓఎన్జీసీ హెలికాప్టర్ 
  • ఒకరి మృతదేహం లభ్యం
  • మిగిలినవారి కోసం గాలింపు
ఓఎన్జీసీకి చెందిన ఉద్యోగులతో ప్రయాణిస్తున్న పవన్ హాన్స్ హెలికాప్టర్ ఈ ఉదయం గల్లంతైన సంగతి తెలిసిందే. ముంబైలోని జుహు ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన పావు గంట తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో చాపర్ కు సంబంధాలు తెగిపోయాయి. ఇందులో ఇద్దరు పైలట్లతో పాటు ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు కూడా ఉన్నారు. హెలికాప్టర్ కోసం గాలింపు చేపట్టిన సిబ్బంది అది సముద్రంలో కూలిపోయినట్టు గుర్తించారు. హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్టు వారు తెలిపారు. గాలింపు చర్యల సందర్భంగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 
ongc
ongc chopper

More Telugu News