Tamil: సినిమాల్లో అవకాశాలు రాకనే ఈ పని చేస్తున్నా: పోలీసుల ముందు తమిళ హీరోయిన్ శ్రుతి

  • ఫేస్ బుక్ మాధ్యమంగా ధనవంతుల బిడ్డలే టార్గెట్
  • అరెస్టయిన 'ఆడి పొన్ అవణి' హీరోయిన్
  • నటిగా అవకాశాలు రాకనే మోసం
  • తల్లి కూడా సాయం చేసిందన్న శ్రుతి
సినీ రంగంలో సరైన అవకాశాలు లభించక, రాణించలేకపోయిన కారణంగానే, ఫేస్ బుక్ మాధ్యమంగా ధనవంతులైన యువకులను మోసం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తమిళ వర్థమాన నటి, 'ఆడి పొన్ అవణి' హీరోయిన్ శ్రుతి పోలీసుల విచారణలో తెలిపింది. ఎన్నారై బాలకృష్ణన్ నుంచి రూ. 50 లక్షలు నొక్కేయడంతో పాటు టెక్కీ అరుళ్ కుమార్, సంతోష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తదితరుల నుంచి లక్షలాది రూపాయలను దిగమింగిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.

 తన తల్లి, సోదరుడి సహకారంతోనే ఈ పని చేశానని, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడటంతో ఖర్చులు పెరిగాయని అంగీకరించింది. మొత్తం ఎనిమిది మందిని మోసం చేసినట్టు తెలిపింది. కాగా, శ్రుతితో పాటు ఆమె తల్లి, సోదరుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, మరింత మందిని ఈమె మోసం చేసి ఉండవచ్చన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని తెలిపారు.
Tamil
Heroin Sruthi
Arrest
Police

More Telugu News