sashikala: భారీగా బయటపడుతున్న శశికళ, కుటుంబసభ్యుల ఆస్తులు.. నివ్వెరపోతున్న అధికారులు!

  • రూ. 4,500 కోట్ల ఆస్తులు
  • 1800 ఎకరాల భూమి
  • 80 నకిలీ కంపెనీలు
ఐటీ అధికారుల సోదాల్లో కళ్లు చెదిరిపోయే రీతిలో శశికళ, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులు బయటపడుతున్నాయి. మొత్తం 187 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ. 4,500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 80 నకిలీ కంపెనీలను గుర్తించారు. నకిలీ కంపెనీల పేరుతో 1800 ఎకరాల భూమిని వీరు కొనుగోలు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు.

ఇదే సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. మరోవైపు, పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరింత కీలక సమాచారం ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, సోదాల్లో బయటపడుతున్న ఆస్తులను చూసి అధికారులు నివ్వెరపోతున్నారు.
sashikala
sashikala assets

More Telugu News