పాక్ పై కాదు.. చైనా సరిహద్దులపై దృష్టి సారించాల్సి సమయం వచ్చింది.. చైనాతో ముప్పే: ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- చైనాతో ఏ క్షణంలోనైనా ముప్పే
- చైనా సరిహద్దుల్లో మిలిటరీ మౌలిక వసతులు పెంచాలి
- చైనా గీత దాటితే.. తిప్పి కొట్టే సత్తా మనకుంది
ఉత్తర డోక్లాంలో చైనా తన సైన్యాన్ని మోహరిస్తోందని ఆర్మీ చీఫ్ తెలిపారు. శీతాకాలం ముగిసిన వెంటనే, సరిహద్దుల్లోని కేంద్రాల్లో కూడా చైనా బలగాలు మోహరించే అవకాశం ఉందని అన్నారు. దీనికి అనుగుణంగానే భారత బలగాలను కూడా మోహరింపజేస్తామని చెప్పారు. భారత భూభాగంలోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చేందుకు యత్నిస్తే... సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. నేపాల్, మయన్మార్, బూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంప్రదింపులను కొనసాగిస్తూ, చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిని సారించాలని అన్నారు. భారత్ కు దూరంగా ఈ దేశాలు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు.