Andhra Pradesh: ఏపీని కట్ చేస్తావా? ఏం మాటలవి?... మంత్రి మాణిక్యాలరావుపై ప.గో. జడ్పీ చైర్మన్ బాపిరాజు ఫైర్

  • మంత్రిపై విరుచుకుపడిన బాపిరాజు
  • నోరు జారడం, వెనక్కి తగ్గడం ఆయనకు అలవాటేనని వ్యాఖ్య
  • అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్
ఏపీ మంత్రి మాణిక్యాలరావుపై పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఫైరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రి మాణిక్యాలరావు లేనిపోని మాటలు అంటున్నారని మండిపడ్డారు. ఏపీనే కట్‌చేస్తానని ఆయన అనడం ఏంటని ప్రశ్నించారు. అయినా, ముందు నోరు జారడం, తర్వాత వెనక్కి తగ్గడం మంత్రికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలనే దూరం పెట్టిన గొప్ప వ్యక్తి మాణిక్యాలరావు అని వ్యంగ్యంగా అన్నారు. అనవసరపు ఆరోపణలు  మాని అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.

తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ బాపిరాజుపై మండిపడ్డారు. తాను నిత్యం ముఖ్యమంత్రి పక్కన కూర్చునే వ్యక్తినని, తన నియోజకవర్గానికి వచ్చే నిధులను, పనులను బాపిరాజు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోసారి అలా చేస్తే తాను మగాడినో, కాదో తేల్చుకుంటానని తీవ్రస్థాయిలో బాపిరాజును ఉద్దేశించి మంత్రి హెచ్చరించారు.
Andhra Pradesh
Minister
Manikyala Rao
Chandrababu

More Telugu News