kcr: ప్రజల జీవితాల్లో సంక్రాంతి కొత్త కాంతులు నింపాలి!: కేసీఆర్

  • సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
  • ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలి  
  • బంగారు పంటలు పండాలని ఆకాంక్ష
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి భగవంతుడిని ప్రార్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
kcr
telangana
sankranthi

More Telugu News