justice chalameshwar: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ను కలిసిన డి.రాజా

  • చలమేశ్వర్ నివాసానికి వెళ్లిన డి.రాజా
  • 20 నిమిషాల సమావేశం
  • కపిల్ సిబల్ తో రాహుల్ చర్చలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సిట్టింగ్ జడ్జిలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదంటూ వీరు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో, రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతున్నట్టు ఉంది. సీపీఐ నేత డి.రాజా చలమేశ్వర్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. మరోవైపు ఈ విషయంపై కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కపిల్ సిబల్ తో రాహుల్ గాంధీ చర్చిస్తున్నారని సమాచారం. 
justice chalameshwar
supreme court
d.raja

More Telugu News