kanimozhi: కనిమొళిపై కేసు నమోదు చేయండి: బీజేపీ

  • తిరుమల వెంకన్నపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు
  • మండిపడ్డ బీజేపీ నేతలు
  • క్రిమినల్ కేసు పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పేదలను కాపాడలేని దేవుడు మనకు అవసరమా? అని ఆమె రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. హుండీనే కాపాడుకోలేని దేవుడు ప్రజలను ఏం కాపాడుతాడంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనిమొళి వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు.
kanimozhi
BJP
kanimozhi comments on tirumala

More Telugu News