Revanth Reddy: రేపటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ అవినీతి బయటపెడతాం: రేవంత్ రెడ్డి

  • పాలకపక్షం తోకముడిచి పారిపోయింది
  • అయినా, వదిలిపెట్టం
  • విద్యుత్ రంగంలో అవినీతిపై చర్చకు తేదీ, సమయం నిర్ణయించాం
  • కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి
విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసరడం, అందుకు, రేవంత్ ప్రతి సవాల్ విసరడం తెలిసిందే. అయితే, విశ్వసనీయత లేని రేవంత్ వంటి వ్యక్తులతో ‘విద్యుత్’పై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఈ చర్చకు రావాలని తాజాగా బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

 దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘విద్యుత్’పై చర్చకు వస్తే వారి బండారం బయటపడుతుందని మాట మార్చారని విమర్శించారు. విద్యుత్ రంగంలో అవినీతిపై చర్చకు తేదీ, సమయం నిర్ణయించామని, పాలకపక్షం తోకముడిచి పారిపోయిందని, అది పారిపోయినా వదిలిపెట్టమని, రేపటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని అన్నారు. 
Revanth Reddy
Congress

More Telugu News