Kamal Haasan: రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి నేను అటువంటి పనులు చేయను: కమల హాసన్

  • స్నేహితులను శత్రువులుగా మార్చుకోలేను
  • ఇటువంటివి చేయడం ప్రజలకు సైతం నచ్చదు
  • ప్రజల కోసం యాప్‌ను విడుదల చేస్తాను
సినీనటులు రజనీకాంత్, కమల హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా కమల హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రయాణంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోలేనని రజనీకాంత్‌ను ఉద్దేశించి అన్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తాను ఇటువంటి పనులు చేయబోనని తెలిపారు. ఇటువంటివి చేయడం ప్రజలకు సైతం నచ్చదని చెప్పుకొచ్చారు. కాగా, తాను ప్రారంభించాలనుకుంటోన్న యాప్ గురించి కమల హాసన్ మాట్లాడుతూ... ప్రారంభించడంలో ఆలస్యమవుతోందని కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అయితే లాంచ్‌ చేయడం సినిమా విడుదల చేసినంత సులువు కాదని అన్నారు. దాన్ని ప్రజల కోసం విడుదల చేస్తున్నానని, తొందరపడకూడదని చెప్పుకొచ్చారు.
Kamal Haasan
Rajinikanth
Tamilnadu

More Telugu News