v hanumantha rao: చంద్రబాబు చాలా ఇంటెలిజెంట్.. పవన్ విషయంలో మోదీకే షాక్ ఇచ్చారు!: వీహెచ్

  • మోదీ కావాలనుకున్న పవన్ ను చంద్రబాబు లాగేశారు
  • ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు
  • పవన్ కు అవగాహన లేదు
కాపులను ఆకర్షించేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. గతంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు మోదీ హాజరైనప్పుడు... పవన్ కు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారని, చంద్రబాబు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చేలోగానే ముందుకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.

కానీ, చంద్రబాబు చాలా ఇంటెలిజెంట్ అని... మరుసటి రోజే పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి, మొత్తం సెట్ చేసేశారని చెప్పారు. 'బ్రదర్ నాకు సపోర్ట్ చెయ్... మొత్తం నేను చూసుకుంటా' అంటూ పవన్ ను గ్రిప్ లో పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు అదే పని కేసీఆర్ కూడా చేస్తున్నారని చెప్పారు. వాస్తవానికి జనాలకు ఒకటి చూపిస్తున్నారని, లోపల మాత్రం మరొకటి జరుగుతోందని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిటనేది జనాలందరికీ తెలిసిపోయిందని వీహెచ్ అన్నారు. పత్రికలు, టీవీల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారని... కానీ, వాస్తవంగా జరుగుతున్నది ఏమీ లేదని చెప్పారు. అవగాహన లేకుండానే కేసీఆర్ ను పవన్ కల్యాణ్ పొగుడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల విద్యుత్ ను అందించగలుగుతున్నారని చెప్పారు.
v hanumantha rao
Chandrababu
KCR
Pawan Kalyan

More Telugu News