వారం రోజుల టైమడిగిన ప్రదీప్.. రెండు రోజులు ఇచ్చిన పోలీసులు
- కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కావాలన్న ప్రదీప్
- షూటింగులతో బిజీగా ఉన్నానంటూ అభ్యర్థన
- రెండు రోజుల గడువుకు ఓకే చెప్పిన పోలీసులు
సోమవారం గోషామహల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. మంగళవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రదీప్‌కు మరోమారు నోటీసులు పంపారు. దీంతో బుధవారం నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టుకు ప్రదీప్ తప్పకుండా హాజరవుతాడని అందరూ భావించారు. అయితే మరోమారు డుమ్మా కొట్టాడు. తాను షూటింగులతో బిజీగా ఉన్నానని, తనకు వారం రోజులు సమయం కావాలని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను కోరాడు. అయితే వారు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. మరి ఈసారైనా ప్రదీప్ కోర్టుకు హాజరవుతాడో? లేదో? వేచి చూడాల్సిందే.