china: హై స్పీడ్ ట్రైన్‌ డోర్ వద్ద నిలబడి నానా హంగామా చేసిన యువతి.. మీరూ చూడండి!

  • కదలడానికి సిద్ధంగా ఉన్న రైలు డోర్ వద్ద నిలబడ్డ యువతి
  • తన భర్త వచ్చేవరకు రైలు స్టార్ట్ చేయొద్దని హల్‌చల్
  • బలవంతంగా దింపేసి, చర్యలు తీసుకున్న రైల్వే అధికారులు
  • తూర్పు  చైనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఘటన
తూర్పు  చైనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో కదలడానికి సిద్ధంగా ఉన్న ఓ హై స్పీడ్ రైలు డోర్ వద్ద నిలబడి ఓ యువతి నానా హంగామా చేసింది. తన భర్త టికెట్ కౌంటర్ దగ్గరే ఉన్నాడని, ట్రైన్‌ను అప్పుడే స్టార్ట్ చేయొద్దని చెప్పింది. రైల్వే అధికారులు ఆమె చర్యపై మండిపడ్డారు. రైల్వే స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని ఆమెకు గట్టిగా చెప్పారు. ఒక్కరి కోసం వందలాది మంది ఎదురు చూడాలా? అని నిలదీశారు. రైలులోకి వెళ్లాలని, లేదంటే రైలు దిగాలని సూచించారు.

అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తన భర్త వచ్చేవరకు రైలుని ఆపాల్సిందేనని డోరు వేయడానికి వీల్లేదని డోరు పడకుండా అడ్డంగా నిలబడింది. చివరకు ఆమెను బలవంతంగా రైలు డోర్ నుంచి కిందకు దింపి తీసుకెళ్లారు. ఆమె ప్రవర్తన కారణంగా రైలు కాస్త ఆలస్యంగా కదిలింది. ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలకు చిక్కింది. 
china
Woman blocks train door

More Telugu News