Andhra Pradesh: ఏపీ సచివాలయంలో సంక్రాంతి శోభ: క‌బ‌డ్డీ ఆడుకున్న ఉద్యోగులు.. ముగ్గులు వేసిన మ‌హిళా ఉద్యోగులు!

షార్ట్స్‌లో చూడండి
సంక్రాంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సచివాల‌య‌ ఉద్యోగులు ఆట‌ల పోటీల్లో పాల్గొని స‌ర‌దాగా గ‌డిపారు. ఉద్యోగిణులు వేసిన రంగ‌వ‌ల్లులు అల‌రించాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ మాట్లాడుతూ... నిత్యమూ ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహిస్తోన్న ఆట విడుపు కార్యక్రమాలు ఎంతో ఉత్తేజాన్నిస్తాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రతి ఏటా సచివాలయంలో సంక్రాంతి సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ఉద్యోగులకు సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు.          
     
Go Back to Shorts
Andhra Pradesh
secretariat
employees

More Telugu News