Telangana: ఎక్కడికి రావాలో చెప్పండి? ప్రగతి భవన్ అయినా ఓకే!: బాల్క సుమన్ సవాల్ కు రేవంత్ ప్రతి సవాల్

  • రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేము రెడీ
  • విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను నిరూపిస్తాం
  • ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు: రేవంత్
దమ్ముంటే విద్యుత్ పై చర్చించేందుకు రావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విసిరిన సవాల్ కు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేము రెడీ. ఎక్కడికి రావాలో చెప్పండి? ఈ అంశంపై చర్చిస్తామంటే ప్రగతి భవన్ కు అయినా సరే వస్తాం. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను మేము నిరూపిస్తాం. ఎవరు మాట్లాడుతున్నది తప్పో, ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని రేవంత్ దీటుగా ప్రతి స్పందించారు.
Telangana
Revanth Reddy

More Telugu News