BJP: మీరు హిందువైతే నాకు.. ముస్లిం అయితే కాంగ్రెస్‌కు ఓటు వేయండి: రాజస్థాన్ బీజేపీ మంత్రి‌

  • రాజస్థాన్‌లోని అల్వార్‌ లోక్‌సభకు త్వరలోనే ఉప ఎన్నిక
  • బీజేపీ అభ్యర్థి, మంత్రి జస్వంత్ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
రాజస్థాన్‌లోని అల్వార్‌ లోక్‌సభకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్థి, మంత్రి జస్వంత్ యాదవ్‌ దుఘేడా గ్రామంలో ప్రచారంలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు హిందువైతే తనకు, ముస్లింలు అయితే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి.

కాగా, ఈ వీడియో గురించి తెలుసుకున్న బీజేపీ నేతలు అది కాంగ్రెస్‌ చేసిన కుట్ర అని అంటున్నారు. తమ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు లభిస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.
BJP
rajasthan
alwar

More Telugu News