YSRCP: చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన రోజా.. వీడియో మీరూ చూడండి

  • పుత్తూరులో వైసీపీ ర్యాలీ
  • ప్రత్యేకహోదా, నిరుద్యోగభృతిని డిమాండ్ చేస్తూ నిరసన
  • బాబుది అబద్ధాల పాలన అన్న రోజా
ప్రత్యేక హోదా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీని చేపట్టింది. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవుల్లో పువ్వులు పెట్టుకుని ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు. బాబు వస్తే జాబు అని ప్రచారం చేసుకున్నారని... కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలన అంతమయ్యే రోజు దగ్గర పడిందని అన్నారు.
YSRCP
roja
Chandrababu

More Telugu News