Chandrababu: చంద్రబాబు సీఎంగా ఉండటం దురదృష్టకరం : వైఎస్ జగన్

  • చంద్రబాబు తన సొంత జిల్లానే అభివృద్ధి చేయలేకపోయారు
  • ఆయన పుణ్యమా అని రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి
  • అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు
  • పెనుమూరు బహిరంగ సభలో జగన్
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండటం దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. పెనుమూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు తన సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారని, అటువంటి సీఎం ఉండటం మన దురదృష్టమని విమర్శించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు.

చంద్రబాబు పుణ్యమా అని రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ‘హెరిటేజ్’ డెయిరీ కోసం ఓ పద్ధతి ప్రకారం చిత్తూరు డెయిరీని మూసివేయించారని, జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలను సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ధరలు ఆకాశాన్నంటుకున్నాయని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు.
Chandrababu
ys jagan

More Telugu News