jc diwakar reddy: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

  • రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదు
  • చేయాల్సింది మోదీనే
  • అవసరానికి చంద్రబాబును మోదీ వాడుకుంటున్నారు
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చెయ్యి ఎత్తమంటే తాము ఎత్తాలని... దించమంటే దించాలని సెటైరిక్ గా కామెంట్ చేశారు. అంతకు మించి తాము చేయగలింది ఏమీ లేదని అన్నారు. విజయవాడలో ఎంపీలతో రైల్వే శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

రైల్వే జోన్ పై చెప్పాల్సింది ప్రధాని మోదీనే అని ఆయన అన్నారు. మనిషికి కొంచెం భయం ఉంటేనే అన్నీ వస్తాయని... భయం లేకపోతే ఆ వ్యక్తిలో విచ్చలవిడితనం పెరిగిపోతుందని విమర్శించారు. అవసరాన్ని బట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని... ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు.
jc diwakar reddy
Narendra Modi
Chandrababu
visakhapatnam railway zone

More Telugu News