parthasarathi: జన్మభూమి కార్యక్రమానికి వెళుతుండగా.. వైసీపీ నేత పార్థసారథి అరెస్ట్!

  • ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత
  • తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ మండిపాటు
  • వైయస్ హయాంలో విపక్ష నేతలకు కూడా ఛాన్స్ వుండేది 
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్థసారథి వెళుతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని... జన్మభూమి సభలకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

 జన్మభూమి సభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తే అవకాశం విపక్ష సభ్యులకు ఇవ్వడం లేదని అన్నారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగానే జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని సభలను నడిపిస్తున్నారని విమర్శించారు. వైయస్ హయాంలో విపక్ష నేతలకు కూడా మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని పార్థసారథి మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తన నోటికి నల్ల రిబ్బన్ కట్టుకున్నారు.
parthasarathi
YSRCP
janmabhoomi
parthasathi arrest

More Telugu News