Rajanikant: పార్టీ గుర్తు, పేరు ప్రస్తుతానికి సస్పెన్స్... ఇప్పట్లో చెప్పేది లేదు: రజనీకాంత్ స్పష్టీకరణ

  • మలేషియా పర్యటనను ముగించుకుని వచ్చిన రజనీకాంత్
  • మీడియాతో మాట్లాడిన తలైవా
  • సంక్రాంతి నాడు పార్టీ పేరు, గుర్తు వెల్లడించబోనన్న రజనీ
తాను పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు, గుర్తును ఇప్పట్లో వెల్లడించే అవకాశం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తన మలేషియా పర్యటనను ముగించుకుని చెన్నై చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా పార్టీ పేరు, గుర్తును తాను వెల్లడించనున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు. అటువంటి అధికారిక ప్రకటనలు ఏమీ లేవన్నారు.  తాను ఆరాధించే బాబా ముద్ర పార్టీ గుర్తన్న వార్తలు ఊహాగానాలేనని అన్నారు.

 ఇదిలావుండగా, రజనీ విడుదల చేసిన మక్కల్ మండ్రం యాప్ లో కుడి చేతి వేళ్లతో యోగముద్ర ఉండగా, ఇది తమ లోగోయేనని సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఓక్స్ వెబ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ లోగోను పోలినట్టుగా పార్టీ గుర్తును చూపిస్తున్నారని ఆరోపిస్తూ, సమాధానం చెప్పాలని రజనీకాంత్ కు లేఖ రాసినట్టు ఓక్స్ వెబ్ ఫౌండర్ వెల్లడించారు కూడా.
Rajanikant
Tamilnadu
New Politicle Party

More Telugu News