Bill Gates: అభివృద్ధిలో ప్రపంచానికే ఏపీ ఆదర్శం కానుంది.. చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ

షార్ట్స్‌లో చూడండి
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రోజు ఇంకెంతో దూరంలో లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. విశాఖపట్టణంలో గతేడాది నవంబరులో నిర్వహించిన అగ్రిటెక్ సమ్మిట్-2017కు హాజరైన బిల్‌గేట్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

వ్యవసాయం, పౌష్టికాహారం, ఆరోగ్య అంశాలను సమ్మిళితం చేసి ప్రణాళిక రూపొందించాలన్న చంద్రబాబు ఆలోచన అద్భుతమని లేఖలో కొనియాడారు. రాష్ట్రంలో 85 శాతం మందికి ఆరోగ్య బీమా ఉండడం ప్రశంసనీయమన్నారు. వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్న బిల్‌గేట్స్,  భూసార పరీక్షల మ్యాపింగ్‌తోపాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు ప్రయత్నిస్తామని బిల్‌గేట్స్ హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Bill Gates
Chandrababu
Andhra Pradesh

More Telugu News