sankranthi: సంక్రాంతి ప్రత్యేకం.. సచివాలయ క్యాంటిన్‌లో అచ్చ తెలుగు వంటకాలు

  • ఈ నెల 9వ తేదీ రాగి సంకటి, వేరుశనగ పచ్చడి
  • 10న దంపుడు బియ్యం పలావ్
  • 11న మెంతి కూర టొమాటో అన్నం
  • 12న బెల్లం పొంగల్, మసాల వడ  
 సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అమరావతిలోని సచివాలయంలో ప్రత్యేక తెలుగు వంటకాల రుచులు అందిస్తోందని సచివాలయ సంఘం అధ్యక్షుడు వంకాయల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఈ వంటకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ రాగి సంకటి, వేరుశనగ పచ్చడి, 10న దంపుడు బియ్యం పలావ్, 11న మెంతి కూర టొమాటో అన్నం, 12 న బెల్లం పొంగల్, మసాల వడ అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.
sankranthi
Andhra Pradesh
meals

More Telugu News