ntr: ఎన్టీఆర్ నటనతో పోల్చుకుంటే బాలకృష్ణదెంత?: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు

  • ఎన్టీఆర్ కారణ జన్ముడు
  • ఆ కుటుంబంలో అంతటి పేరున్న వ్యక్తి ఇంకెవరున్నారు?
  • సెట్ లో కూర్చుని ఎన్టీఆర్ డైలాగ్స్ ను బాలకృష్ణ చెబుతుంటాడు
  • ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు
ఎన్టీఆర్ కారణ జన్ముడని, అందువల్లే, ఆయన ఏదైనా చెడు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ కారణజన్ముడు కనుకనే ఆయన ఒక్కడికే అంతటి పేరు వచ్చిందని, అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి వాళ్ల కుటుంబంలో ఇంకెవరున్నారు? అని ప్రశ్నించారు. ‘ఆ బాలకృష్ణకు ఏదో అందంగిందం వచ్చింది. ఆయన భాష తెలిసిందే. ఆయన (ఎన్టీఆర్) నటనతో పోల్చుకుంటే ఈయనదెంత? ఎంత సేపటికీ సెట్ లో కూర్చుని ఆయన (ఎన్టీఆర్) డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటాడు బాలకృష్ణ’ అని అన్నారు.

ntr
Balakrishna

More Telugu News