Anushka Shetty: దుమ్మురేపేస్తోన్న 'భాగమతి' ట్రైలర్ .. అనుష్క విశ్వరూపం

  • 'భాగమతి'గా అనుష్క 
  • దర్శకుడిగా అశోక్ 
  • జనవరి 26న విడుదల
'అరుంధతి' .. 'రుద్రమదేవి' చిత్రాల కోవలో అనుష్క చేసిన కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం 'భాగమతి'. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, భారీతనానికి అద్దం పడుతోంది. ట్రైలర్ మొదట్లో .. జనానికి మంచి చేసే ఐఏఎస్ అధికారిణిగా అనుష్క కనిపిస్తోంది.

 కొంతమంది దుర్మార్గులు ఓ పథకం ప్రకారం ఆమెను ఓ పాడుబడిన బంగళాలో బంధించడం .. తనని అక్కడి నుంచి తీసుకెళ్లమని అనుష్క దీనంగా వేడుకోవడం ట్రైలర్ లో కనిపిస్తోంది. "ఎవరుపడితే వాడు రావడానికీ .. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా .. 'భాగమతి' అడ్డా .. లెక్క తేలాలి .. ఒక్కణ్ణీ పోనివ్వను" అంటూ 'భాగమతి' లుక్ తో అనుష్క చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తోంది. సినిమాపై అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నటన పరంగా అనుష్క విశ్వరూపం చూపుతోన్న ఈ సినిమాను, జనవరి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 
Anushka Shetty
unni mukundan

More Telugu News