Kamal Haasan: ఒకే హెలికాప్టర్లో వచ్చి.. వేదికను పంచుకున్న రజనీకాంత్, కమల్ హాసన్!

  • మలేషియాలో అరుదైన ఘటన
  • నడిగర్ సంఘ భవనానికి నిధుల సమీకరణ
  • ఒకే హెలికాప్టర్ లో వచ్చిన కమల్, రజనీ
  • అభిమానుల కేరింతలు
తాము రాజకీయాల్లోకి వస్తామని చెప్పిన తరువాత తొలిసారిగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. ఈ అరుదైన సీన్ మలేషియాలోని కౌలాలంపూర్ కనిపించింది. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.

అక్కడి ఓ మైదానంలో జరిగిన కార్యక్రమానికి అసంఖ్యాకంగా అభిమానులు, తమిళులు హాజరు కాగా, వారి కేరింతల మధ్య ఒకే హెలికాప్టర్ లో ప్రయాణించిన వచ్చిన ఇద్దరు హీరోలూ కిందకు దిగారు. ఆపై బ్యాటరీ వాహనం ఎక్కి గ్రౌండంతా తిరుగుతూ, అభిమానులకు అభివాదం చేశారు.

రజనీకాంత్ బ్లాక్ డ్రస్ లో, కమల్ వైట్ డ్రస్ లో ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. వీరిద్దరితో పాటు తమిళ నటులు విజయ్, సూర్య, ఆర్య, విక్రమ్, విజయ్ సేతుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, మలేషియాలో దాదాపు 20 లక్షల మందికి పైగా తమిళులు ఉన్నారు.
 
Kamal Haasan
Rajanikant
Malaysia
Koulalampur
Nadigar Sangham

More Telugu News