కత్తి మహేశ్ వ్యాఖ్యలకు పవన్ అభిమాని మనస్తాపం .. సెల్ టవర్ ఎక్కిన వైనం!

  • పశ్చిమగోదావరి జిల్లాలో సంఘటన
  • సెల్ ఫోన్ ద్వారా యువకుడిని సముదాయించిన పోలీసులు
  • ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు
ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమాని ఒకరు మనస్తాపం చెంది, సెల్ టవర్ ఎక్కిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులో జరిగింది.

సిరిమళ్ల జ్యోతి కృష్ణ అనే యువకుడు సెల్ టవర్ పైకి ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. అక్కడి నుంచి అతన్ని కిందకు దించే ప్రయత్నాల్లో భాగంగా అతనితో పోలీసులు ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. ఈ సంఘటన నేపథ్యంలో జ్యోతికృష్ణ  కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సెల్ టవర్ వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News