Pawan Kalyan: పవన్, త్రివిక్రమ్ క్షుద్రపూజలు చేశారు.. నా వద్ద సాక్ష్యం ఉంది : కత్తి మహేశ్

  • క్షుద్రపూజలు నిర్వహించిన పూజారి పేరు నరసింహ
  • తాంత్రిక విధానాల్లో ఈ పూజలు రెండు, మూడు సార్లు చేశారు
  • నా దగ్గర ఓ వీడియో ఉంది
  • సమయం వచ్చినప్పుడు బయటపెడతా: కత్తి మహేశ్
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్షుద్రపూజలు చేశారని, తన వద్ద వీడియో సాక్ష్యం ఉందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘టీవీ9’ లైవ్ ప్రోగ్రామ్ లో కత్తి మహేశ్ మాట్లాడుతూ, ‘ప్రజా జీవితంలో ఉన్న పవన్ కల్యాణ్ గురించి చాలా భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు కొన్ని నిజాలు కావు అని చెప్పడం నా ఉద్దేశం. పవన్ కల్యాణ్ దేవుడని, ప్రజా సేవ చేసేస్తున్నాడని భావించే వాళ్లకు అతనిలో ఉన్న మరో పార్శ్వం తెలియదు. ఆ మరో పార్శ్వాన్ని నేను కనుగొన్నాను. అతను హీరో అయితే ఏంటి? ప్రశ్నించకూడదా? అనే ఆలోచన రావాలి, మద్దతు పలకాలి.

కానీ, అలాంటిది జరగడం లేదు. నాకు అర్థమైందేమిటంటే, మనందరం బానిసబతుకులు బతుకుతూ చాలా సుఖంగా ఉన్నాం. పవన్, త్రివిక్రమ్ క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. విజువల్ గా నేను చూసిందైతే పూజలు..కొన్ని తాంత్రిక విధానాల్లో ఈ పూజలు చేశారు. ఆ పూజలు చేసిన పూజారి పేరు నరసింహ. ఆ పూజలు ఎక్కడ చేశారో నాకు తెలియదు. ఈ పూజారి ఎవరనే విషయమై ‘టీవీ9’ ఆరా తీస్తే... అన్ని విషయాలు బయటపడతాయి.

పవన్, త్రివిక్రంలు రెండు, మూడు సార్లు తాంత్రిక పూజలు చేసినట్టు తెలుసు. కాకపోతే, నా దగ్గర ఒక వీడియో మాత్రమే ఉంది. శాక్తేయంగా, వైష్ణ వేయంగా చేసే పూజల మధ్య తేడాలు నాకు బాగా తెలుసు. తాంత్రిక పూజల్లో కూడా ఎలాంటి ముగ్గులు వేస్తారో కూడా నాకు తెలుసు. ఇందుకు సంబంధించిన వీడియోను సమయం వచ్చినప్పుడు బయటపెడతా. సమాజాన్ని పక్కదోవ పట్టించే వ్యక్తులు (పవన్, త్రివిక్రమ్) మన మధ్య నివసిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శనీయంగా మారుతుండటం చాలా ప్రమాదకరం’ అని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News