Pawan Kalyan: పెద్దవాళ్లు, అంకుల్స్ తో నేను మాట్లాడను: కత్తి మహేశ్ పై హాస్యనటుడు వేణుమాధవ్ వ్యంగ్యాస్త్రాలు

  • పరిచయం లేని వాళ్లతో నేను మాట్లాడను
  • ‘లైవ్’లో మాట్లాడకండి 
  • పవన్ అభిమానులందరికీ, ‘జనసేన’ ఫ్యాన్స్ కి నా విన్నపం
  • సినీ నటుడు వేణుమాధవ్
పెద్దవాళ్లు, అంకుల్స్ తో తాను మాట్లాడనంటూ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ పై హాస్యనటుడు వేణుమాధవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీవీ9’ లైవ్ ప్రోగ్రామ్ లో కత్తి మహేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ లైన్ ద్వారా వేణుమాధవ్ మాట్లాడుతూ, ‘యాంకర్ సత్య.. మీరు నాకు పరిచయం కనుక, నేను మీతోనే మాట్లాడతాను. పరిచయం లేని వాళ్లతో నేను మాట్లాడను. మీ ద్వారా పవన్ అభిమాని కిరణ్ రాయల్ కు, పవన్ అభిమానులందరికీ, జనసేన ఫ్యాన్స్ కి నేను తెలియజేస్తున్నదేమిటంటే..దయచేసి, ఎవరూ లైవ్ లో మాట్లాడకండి.

 ఆడవాళ్ల మీద, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపైనా మాట్లాడితే, వారిపై చర్యలు తీసుకోక తప్పదు. నేను ఎవరినీ విమర్శించను. విమర్శించే అలవాటు నాకు లేదు. పెద్దవాళ్లు, అంకుల్స్ (కత్తి మహేశ్)తో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను. వాళ్లని గౌరవించే అలవాటు నాకు ఉంది. ఆ అంకుల్ ని గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంది. నా ఉద్దేశంలో ఆయన(కత్తి మహేశ్)కు ఆరోగ్యం పాడై ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో తిరుమలకు వెళ్లిన పూనమ్ కౌర్.. పవన్ కల్యాణ్ గోత్రనామాలతో పూజలు చేయించుకున్నదని కత్తి మహేశ్ ఆరోపణల కారణంగా పవన్ అభిమానులు మండిపడ్డారు.ఈ సందర్భంగా కత్తి మహేశ్ పై పవన్ అభిమాని కిరణ్ రాయల్ మండిపడ్డారు.
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News