Virat Kohli: హనీమూన్ చేసుకుంటుంటే పిలిస్తే ఇలాగే ఉంటుంది... విరాట్ కోహ్లీపై పేలుతున్న జోకులు!

  • తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ
  • కేవలం 5 పరుగులకే అవుట్ అయిన భారత కెప్టెన్
  • సెటైర్లు వేస్తున్న క్రికెట్ అభిమానులు
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలం కావడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. కేవలం 5 పరుగులను మాత్రమే చేసిన కోహ్లీపై విమర్శిస్తూ, పలువురు ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. బ్యాటింగ్ పిచ్ అయితే 200 పరుగులు చేయగల కోహ్లీ, బౌలింగ్ పిచ్ లో 20 పరుగులు చేయలేకపోయాడని అంటున్నారు.

హనీమూన్ జరుపుకుంటున్న వ్యక్తిని ఉద్యోగానికి పిలిస్తే ఇలాగే ఉంటుందని అంటున్నారు. సౌతాఫ్రికాలో మహాత్మాగాంధీకే ఇబ్బందులు ఎదురయ్యారని, కోహ్లీ ఎంతని సెటైర్లు వేస్తున్నారు. హనీమూన్ హ్యాంగోవర్ నుంచి బయట పడేందుకు కోహ్లీకి మరో 15 ఇన్నింగ్స్ లు పడుతుందని అంటున్నారు. మొత్తం మీద కోహ్లీపై అభిమానుల సెటైర్లు వైరల్ అవుతున్నాయి.
Virat Kohli
Cricket
South Afrika
Test match

More Telugu News