Hyderabad: జూబ్లీహిల్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష బ్రెయిన్ డెడ్

  • గత రాత్రి జూబ్లీహిల్స్ లో ప్రమాదం
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అనూష
  • మెదడు పనిచేయడం లేదన్న వైద్యులు
  • మరో యువతి ప్రియకు చికిత్స
గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష అనే యువతి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఈ ఘటనలో మస్తానీ అనే యువతి అక్కడికక్కడే మరణించగా, అనూషతో పాటు గాయపడిన ప్రియ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురూ కలిసి వాహనంపై వస్తుండగా, 'టీఎస్ 09 ఈవీ 7707' నంబర్ గల కారులో వచ్చిన విష్ణువర్ధన్ యాక్సిడెంట్ చేశాడు. విష్ణు తమ అదుపులోనే ఉన్నాడని, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Hyderabad
Jubilee Hills
Accident
Anusha
Mastani

More Telugu News