Pawan Kalyan: ఎక్కడా తగ్గని కత్తి మహేష్... పీకే టీమ్ స్పందించేనా?
- నేటి ఉదయం 11 గంటలకు బయటకు రానున్న కత్తి మహేష్
- అతని సవాల్ ను తేలికగా తీసుకుంటున్న పవన్ వర్గం నేతలు
- అభిమానులు మాత్రం కౌంటర్ ఇచ్చేందుకు రెడీ!
ఇటీవలి కాలంలో పాప్యులర్ అయిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ను ఎదిరించే క్రమంలో ఎక్కడా తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా వార్ కంటిన్యూ చేస్తున్న కత్తి, పవన్ ఫ్యాన్స్ చేసే విమర్శలు, బెదిరింపులు తనను ఆపలేవని స్పష్టం చేస్తున్నాడు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్ కు తాను వస్తున్నానని, దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కల్యాణ్, పూనం కౌర్ లు రావాలని సవాల్ విసిరాడు. వారి బండారం బయటపెడతానని హెచ్చరించాడు. ఇక కత్తి సవాల్ ను పవన్ కల్యాణ్ టీమ్ ఎలా స్వీకరిస్తుందో మరి కాసేపట్లో తేలిపోతుంది.
కాగా, కత్తి మహేష్ చాలా చిన్న వ్యక్తని, తన ప్రచారం కోసం పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నాడని, అటువంటి వ్యక్తి సవాల్ ను తాము స్వీకరించేది ఏంటన్నది పవన్ వర్గం వారి వాదన. అధికారికంగా ఈ సవాల్ ను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేకున్నా, ఆయన అభిమానులు మాత్రం కత్తికి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. నేటి మీడియా మీట్ ఉదయం 11 గంటలకు జరగనుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని ప్రెస్ క్లబ్ వర్గాలు వెల్లడించాయి.