Kathi Mahesh: 'బషీర్ బాగ్' అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హాల్ బుక్ చేసుకున్న కత్తి మహేష్!

  • నిన్న చాలెంజ్ విసిరిన కత్తి మహేష్
  • ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ క్లబ్ కు రావాలని పిలుపు
  • మారిన ప్రెస్ మీట్ వేదిక
  • సోమాజిగూడ క్లబ్ లో మీడియా మీట్
"రేపు ఉదయం 11 గంటలకు నేను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మిమ్మల్ని ఎదుర్కొంటా. దమ్ముంటే నా ముందుకు రండి.  మీరో నేనో తేల్చుకుందాం. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. మీ బండారం నేను బయటపెడతా. వస్తారా?" అని పవన్ కల్యాణ్, పూనం కౌర్ లను ఉద్దేశించి నిన్న తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన విశ్లేషకుడు కత్తి మహేష్, తన ప్రెస్ మీట్ వేదికను మార్చుకున్నాడు. నిన్న ఆయన సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ హాల్ ను బుక్ చేసుకున్నాడు. ఉదయం 11 గంటలకు కత్తి మహేష్ ప్రెస్ మీట్ సాగనుండగా, అతన్ని ఎదుర్కొనేందుకు పవన్ ఫ్యాన్స్ సైతం ప్రెస్ క్లబ్ వద్దకు రానున్నారని సమాచారం.
Kathi Mahesh

More Telugu News