Pawan Kalyan: వారం రోజుల పాటు రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 మధ్య స్పెషల్ షోలు... 'అజ్ఞాతవాసి'కి ఏపీ పర్మిషన్!

  • పవన్ కల్యాణ్ సినిమాకు ప్రత్యేక అనుమతులు
  • ఇప్పటికే సంక్రాంతి నైట్ షాపింగ్ కు అనుమతి
  • స్పెషల్ షోలకూ ఓకే చెప్పిన చంద్రబాబు సర్కారు
మరో మూడు రోజుల్లో విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షోలను ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ఈ ప్రత్యేక షోలను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ప్రదర్శించుకునేందుకు అంగీకరించింది. సంక్రాంతి సెలవుల దృష్య్యా, నైట్ షాపింగ్ కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, సెలవు రోజుల్లో రాత్రి పూట సినిమా ప్రదర్శనలకు అనుమతి కావాలంటూ చాలా రోజులుగా డిమాండ్ వస్తున్నదని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
Pawan Kalyan
Agnatavasi
Special Shows
Sankranti

More Telugu News