United Airlines: విమానంలో ప్రయాణికుడి 'అశుద్ధ'పు పని... గందరగోళం మధ్య విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్!

  • అశుద్ధాన్ని తెచ్చి ప్రయాణికులకు అంటించిన వ్యక్తి
  • షికాగో - హాంకాంగ్ ఫ్లయిట్ లో ఘటన
  • అలస్కాలో విమానాన్ని దింపేసిన అధికారులు
ఓ ప్రయాణికుడు చేసిన అశుద్ధపు పనికి ప్రయాణిస్తున్న విమానాన్ని అప్పటికప్పుడు దింపేయడంతో పాటు, ప్రయాణికులను హోటల్స్ కు తరలించి, విమానాన్ని మొత్తం శుభ్రం చేయాల్సి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం షికాగో నుంచి హాంకాంగ్ కు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, ఓ ప్రయాణికుడు టాయిలెట్ కు వెళ్లాడు. తిరిగి వస్తూ, తన చేత్తో అశుద్ధాన్ని తెచ్చాడు.

విమానం గోడలకు, ప్రయాణికులకు అంటించాడు. దీంతో విమానంలో చెప్పలేని దుర్గంధం వ్యాపించడంతో పాటు అసహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య విమానాన్ని అలస్కాలో దించిన అధికారులు, ప్రయాణికులను దించేసి, వారిని హోటల్స్ కి తరలించి, విమానాన్ని కడిగించారు. జరిగిన ఘటనపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని, సదరు ప్రయాణికుడు అలా ఎందుకు ప్రవర్తించాడో తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు రిఫర్ చేశామని పోలీసులు వెల్లడించారు.
United Airlines
Toilet
Chicago
Hongkong

More Telugu News