pavan kalyan: 'అజ్ఞాతవాసి' ప్రీమియర్లకు రెడీ అవుతోన్న కుర్ర హీరోలు

  • 'అజ్ఞాతవాసి' కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • ప్రీమియర్ షోల పట్ల ఆసక్తి 
  • ఉత్సాహం చూపుతోన్న యువ హీరోలు 
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి'.. ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. విడుదలకి ఒకరోజు ముందు యూఎస్ లోను .. ఇక్కడ ప్రీమియర్ షోలు పడనున్నాయి. బయటి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, పవన్ అభిమానులుగా చెప్పుకునే కుర్ర హీరోలు చాలామంది ఈ ప్రీమియర్ షోలు చూడటానికి రెడీ అవుతున్నారు.

యంగ్ హీరోల్లో చాలామంది పవన్ ను స్ఫూర్తిగా తీసుకుంటూ వుంటారు .. తమ సినిమాల్లో ఆయన ప్రస్తావన తెస్తుంటారు. అలా పవన్ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ప్రస్తుతం యూఎస్ లో వున్న నిఖిల్ .. అక్కడ 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షో చూడటానికి సిద్ధమైపోతున్నాడట. ఇక ఇక్కడి ప్రీమియర్ షోలకి నితిన్ .. శర్వానంద్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ కూడా రెడీ అవుతున్నారట. సినిమా చూశాక ఎవరెవరు ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి.       
pavan kalyan
keerthi suresh
anu

More Telugu News