adhaar: ఆధార్‌ కారణంగా బయటపడ్డ 80 వేల మంది లెక్చరర్ల తీరు!

  • నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోన్న వైనం
  • ఒకటి కంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు స్పష్టం
  • చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వివరణ
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని అరికట్టడానికి ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం సూచిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు తమ అధీనంలో ఉన్న లెక్చరర్ల, విద్యార్థుల ఆధార్‌ను తీసుకోవల్సిందిగా ఆదేశాలు జారీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోన్న సుమారు 80 వేల మంది లెక్చరర్లు బయటపడ్డారు. వీరంతా ఒకటి కంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు ఇందులో తేలింది.

 వీరిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ చెప్పారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పని చేసేవారు ఎవరూ ఈ జాబితాలో లేరని వివరించారు. రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో చాల మంది ఉన్నారని పేర్కొన్నారు.
adhaar
universities
lecturers

More Telugu News