jashoda ben: మోదీ భార్యకు భద్రత తొలగించాలి.. లేదా ఆమెను భార్యగా అంగీకరించాలంటూ మియాపూర్ లో నిరాహారదీక్ష!

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని మోదీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోదీ భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహారదీక్షను చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో ఆమె క్లినిక్ నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జశోదబెన్ తో తన వివాహం చెల్లదని మోదీ చెబుతున్నారని... ఈ నేపథ్యంలో, ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

మరోవైపు తనకు ఏ హోదాలో భద్రతను కల్పిస్తున్నారో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండటం తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని భార్యకు ప్రొటోకాల్ ప్రకారం ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. మోదీ తన పాస్ పోర్టులో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో కూడా తెలియజేయాలని ఆర్టీఐ జశోదాబెన్ అధికారులను కోరారు.
Go Back to Shorts
jashoda ben
Narendra Modi

More Telugu News