nayini narsimha reddy: క్రైస్తవుల జోలికి వస్తే తాట తీస్తాం: తెలంగాణ హోం మంత్రి

  • క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంది
  • అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలి
  • కేసీఆర్ నిజమైన దేవుడి బిడ్డ అన్న మేయర్
క్రైస్తవుల జోలికి వచ్చినా, వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా చూస్తూ ఊరుకోబోమని, తాట తీస్తామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. క్రైస్తవులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాష్ట్ర, దేశ ప్రార్థనా దినం' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ ఉండాలని చెప్పారు.

 నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన దేవుడి బిడ్డ అని అన్నారు. నగరంలో క్రైస్తవ శ్మశానవాటికలను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, క్రైస్తవులు హాజరయ్యారు. 
nayini narsimha reddy
bonthu rammohan
KCR

More Telugu News