Pawan Kalyan: నిన్ను ఓడించడం చేతకానివాళ్లే.. నీ కులం, వర్ణం గురించి మాట్లాడతారు: పవన్ కల్యాణ్

  • ఓ సీనియర్ జర్నలిస్ట్ నన్ను ఈ విధంగా గ్రీట్ చేశారు
  • షేర్ చేసుకోవాలనిపించింది
  • కులం, పవర్ పాలిటిక్స్ తో సమాజానికి కీడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియా వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. 'వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు' అంటూ ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. దీన్ని ఎవరు చెప్పారో తనకు తెలియదు కానీ... గౌరవనీయ ఓ సీనియర్ జర్నలిస్టు తనను ఈ విధంగా గ్రీట్ చేశారంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీన్ని షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పారు.

కులాల పరంగా విడిపోవడం, అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు ప్రస్తుత తరుణంలో పోషిస్తున్న పాత్ర ప్రమాద ఘంటికలను మోగిస్తోందని పవన్ అన్నారు. ఇది మన ఆర్థిక మందగమనానికి కారణం కావడమే కాక, మన సమాజానికి అత్యంత కీడును కలగజేస్తుందని చెప్పారు. 
Pawan Kalyan
Tollywood
janasena

More Telugu News