Ghazal Srinivas: గజల్‌ శ్రీనివాస్‌పై నిప్పులు చెరుగుతున్న కళా సంఘాలు.. బహిష్కరించిన ‘ఆనందలహరి’

  • ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీనివాస్
  • బహిష్కరించిన ఆనందలహరి సాంస్కృతిక సంస్థ
  • కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటూ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై సాంస్కృతిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట వద్దని, కఠినంగా శిక్షించాలని ‘ఆనందలహరి’ సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. కళను అడ్డుపెట్టుకుని ఇటువంటి నీచ  కార్యక్రమాలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మిగతా సాంస్కృతిక, కళా సంఘాలు కూడా తమ బాటనే అనుసరించాలని సూచించింది.

గజల్ శ్రీనివాస్‌పై నమోదైన కేసును నీరుగార్చేందుకు కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. కేసును సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికి తీయాలని పోలీసులను కోరింది. కళను ఇటువంటి దుర్మార్గపు, నీచ కార్యక్రమాలకు వాడుకోవడం హేయమని ధ్వజమెత్తింది. ఒత్తిళ్లకు లొంగకుండా కేసు దర్యాప్తు చేసి శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని ‘ఆనందలహరి’ డిమాండ్ చేసింది.
Ghazal Srinivas
Hyderabad
Anandalahari

More Telugu News