roja: ఢిల్లీలో శివ‌గామిని, ఏపీలో భ‌ల్లాల‌దేవుడిని జ‌గ‌న్ బాహుబ‌లిలా ఎదిరించారు: రోజా

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో శివ‌గామి (సోనియా గాంధీ), ఏపీలో భ‌ల్లాల‌దేవుడు (చంద్ర‌బాబు నాయుడు) ని త‌మ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాహుబ‌లిలా ఎదిరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి ఆయ‌న‌ను 16 నెలలు జైల్లో పెట్టించార‌ని అన్నారు. ఈ రోజు ఓ స‌మావేశంలో రోజా మాట్లాడుతూ... జ‌గ‌న్ చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు యువతను మోసం చేశారని, ఆయ‌న‌పై యువత తిరగబడ‌తార‌ని అన్నారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ ప్ర‌భుత్వం ప్రజలను మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. అటువంటి ప్ర‌భుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల‌ని అన్నారు.  
Go Back to Shorts
roja
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News