Telugudesam mp: ప్రధానితో భేటీ అయిన టీడీపీ, బీజేపీ ఎంపీలు!

  • విభజన హామీలను అమలు చేయాలంటూ విన్నపం
  • సానుకూలంగా స్పందించిన మోదీ
  • ఏపీకి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధమే
ప్రధాని మోదీతో ఏపీకి చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ ఈ సందర్భంగా మోదీని ఎంపీలు కోరారు. ఎంపీల విన్నపంపై మోదీ సానుకూలంగా స్పందించారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా ఎంపీలు కలిశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇంకా అమలు చేయని వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నాలుగేళ్లు పూర్తయిందనే విషయాన్ని ప్రధానికి గుర్తు చేశామని అన్నారు. ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారని, నాలుగేళ్లు చాలా తొందరగా గడచిపోయాయని చెప్పారని, ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే అన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఏపీకి సహకారం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రధాని చెప్పారని తెలిపారు.
Telugudesam mp
bjp mp
Narendra Modi

More Telugu News