akhil: అఖిల్ నెక్స్ట్ మూవీకి నిర్మాతగా రానా?

షార్ట్స్‌లో చూడండి
అఖిల్ తాజా చిత్రంగా వచ్చిన 'హలో' .. నటన పరంగా ఆయనకి మరిన్ని మార్కులను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. తన దగ్గరికి వచ్చిన కథల్లో రెండు కథలు కొత్తగా అనిపించాయనీ, వాటిలో ఒక కథను ఎంపిక చేసి జనవరి 10వ తేదీన ఎనౌన్స్ చేస్తానని అఖిల్ అన్నాడు. అయితే ఆయనకి బాగా నచ్చిన కథను వినిపించిన దర్శకుడు సత్య పినిశెట్టి అని తెలుస్తోంది.

 గతంలో ఆయన 'మలుపు' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సత్య పినిశెట్టి .. రవిరాజా పినిశెట్టి తనయుడు .. ఆది పినిశెట్టికి సోదరుడు. నెల రోజులుగా సత్య పినిశెట్టి .. అఖిల్ సిటింగ్స్ జరుపుతున్నారని అంటున్నారు. ఈ దర్శకుడితోనే అఖిల్ సెట్స్ పైకి వెళ్లొచ్చని చెబుతున్నారు. ఇక విశేషమేమిటంటే, ఈ సినిమాకి నిర్మాతగా రానా పేరు వినిపిస్తోంది. రానా ఈ  సినిమాను నిర్మించడానికి ఆసక్తిని చూపుతున్నాడని చెప్పుకుంటున్నారు.     
Go Back to Shorts
akhil
rana

More Telugu News