Chinarajappa: చంద్రబాబు కోసం వెళుతున్న చినరాజప్ప కాన్వాయ్ లో ప్రమాదం!

  • షార్ట్ సర్క్యూట్ తో మంటలు
  • పూర్తిగా దగ్ధమైన ఎస్కార్ట్ వాహనం
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో భాగంగా నేడు నర్శీపట్నంలో జరిగే సభకు చంద్రబాబుతో పాటు హాజరయ్యేందుకు వెళుతున్న ఏపీ హోం మంత్రి చినరాజప్ప, తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్, మాకవరపాలెం దగ్గరుండగా, ఎస్కార్ట్ వాహనంలోని విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి, ఒక్కసారిగా మంటలు లేచాయి. వెంటనే కాన్వాయ్ ని ఆపేయగా, అందులోని ఆరుగురు సిబ్బందీ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Chinarajappa
Chandrababu
Janmabhoomi

More Telugu News