rajanikanth: రజనీకి అంతా మంచే జరుగుతుంది!: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్

  • రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన అక్షయ్
  • రాజకీయాల్లోనూ రాణిస్తారు
  • రాజకీయ నేతగా ఆయన ఎదుగుతారు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోనూ రాణిస్తారని, ఆయనకు అంతా మంచే జరుగుతుందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, మంచి రాజకీయ నేతగా ఆయన ఎదుగుతారని, ఆయన రాణిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నాడు.

కాగా, రజనీ రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచి ఆయనకు పలువురు నటులు అభినందనలు తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజ్ మహాలింగం, ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు లారెన్స్ రాఘవ.. రజనీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అలాగే, ప్రముఖ నటుడు విశాల్ కూడా రజనీకి మద్దతు తెలిపాడు. 
rajanikanth
akshya kumar

More Telugu News