Vijayawada: దుర్గ గుడిలో తాంత్రిక పూజలకు ఆధారాలు.. సీసీ కెమెరాలో నిక్షిప్తం!

  • ఆరోజు రాత్రి 10.30 నిమిషాలకు అంతరాలయంలోకి వెళ్లిన అనధికార పూజారి రాజా
  • గుమ్మడికాయ, ఇతర పూజాసామాగ్రి తీసుకెళ్లిన వైనం
  • సీసీ కెమెరాలో దృశ్యాలు
విజయవాడ దుర్గ గుడిలో ఇటీవల తాంత్రిక పూజలు జరిగాయనే కథనాలు మీడియాలో వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను దుర్గ గుడి ఈవో సూర్యకుమారి ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. ఆరోజు రాత్రి 10.30 నిమిషాలకు అంతరాలయంలోకి అనధికార పూజారి రాజా వెళ్లినట్లు సీసీ కెమెరా ఆధారంగా తేలింది. తాంత్రిక పూజల నిమిత్తం గుమ్మడికాయ, ఇతర పూజాసామాగ్రిని తీసుకెళ్తున్నట్టు అందులోని దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.
Vijayawada

More Telugu News