Chandrababu: కార్యాలయ వసతి లేకపోయినా.. బస్సులో నుంచే పాలన సాగించిన ఘనత ఒక్క చంద్రబాబుదే!: నారా లోకేశ్

  • ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న, నదుల అనుసంధానం చేసిన ఘనత ఆయనదే
  • 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ  
  • మీడియాతో నారా లోకేశ్
ముఖ్యమంత్రికి కార్యాలయ వసతి కూడా లేకపోయినా బస్సులో నుంచే ఆరు నెలల పరిపాలన సాగించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగకపోవడంతో కొత్త రాష్ట్రాన్ని అప్పులతో మొదలుపెట్టినా ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ, దేశంలో నదుల అనుసంధానాన్ని చేతల్లో చూపించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

2018 నవంబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని, 2018 డిసెంబర్ నాటికి అందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని చెప్పిన లోకేశ్, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
Chandrababu
Nara Lokesh

More Telugu News