Virat Kohli: 'ఈఎస్ పీఎన్' టీ20 జట్టులో కోహ్లీకి నో బెర్త్!

షార్ట్స్‌లో చూడండి
2017 ఏడాదికి గాను ప్రముఖ క్రీడల వెబ్ సైట్ ఈఎస్ పీఎన్ క్రికెట్ జట్లను ప్రకటించింది. గత ఏడాది గొప్పగా రాణించిన ఆటగాళ్లతో మూడు ఫార్మాట్లకు టీమ్ లను ఎంపిక చేసింది. టెస్ట్ టీమ్ కు స్టీవ్ స్మిత్, వన్డే జట్టుకు విరాట్ కోహ్లీ, టీ20 టీమ్ కు రోహిత్ శర్మలను కెప్టెన్లుగా ప్రకటించింది.

అయితే, అనూహ్యంగా టీ20 టీమ్ లో విరాట్ కోహ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయాడు. టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీ, పుజారా మాత్రమే ఉన్నారు. ఒక్క భారత బౌలర్ కూడా చోటు దక్కించుకోలేక పోయాడు. జస్ ప్రీత్ బుమ్రా వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించుకున్నాడు. వన్డే టీమ్ లో ఏకంగా ఐదుగురు ఇండియన్ ప్లేయర్లు ఉండటం గమనార్హం.

వన్డే టీమ్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, జోయ్ రూట్, డీ కాక్, బాబర్ అజామ్, హార్దిక్ పాండ్యా, స్టోక్స్, హసన్ అలీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా.

టెస్టు జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, డీన్ ఎల్గర్, పుజారా, కోహ్లీ, ముషాఫిర్ రహీం, షకీల్ అల్, లియాన్, రబద, అండర్సన్, నీల్ వాగ్నర్.

టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మెక్ కల్లమ్, లూయిస్, హషీమ్ ఆమ్లా, బట్లర్, క్రిస్టియాన్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, హసన్ అలీ, రషీద్ ఖాన్, జస్ ప్రీత్ బుమ్రా
Go Back to Shorts
Virat Kohli
Rohit Sharma
espn teams

More Telugu News